వైఎస్సార్ హఠన్మరణ వార్త విని తట్టుకోలేక తనువు చాలించిన వ్యక్తుల కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారం ఇస్తున్నట్లు సోమవారం ఏఐసీసీ ప్రకటించడంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలుపుతూ బహిరంగ లేఖను రాశారు. ఏఐసీసీ నిర్ణయం ఎంతో అభినందనీయమని కడప ఎంపీ జగన్ పేర్కొన్నారు.
అయితే ఈ జాబితాలో టీవీలను చూస్తూ వైఎస్సార్ మరణ వార్త విని గుండె ఆగిపోయిన వ్యక్తులను కూడా చేర్చితే బావుండేదని అభిప్రాయపడ్డారు. ఇక ఓదార్పు అంటే కేవలం డబ్బులిచ్చి చేతులు దులుపేసుకోవడం కాదనీ, వారి ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వటం సంప్రదాయమని ఏఐసీసీకి తన ఓదార్పు ఆగదని పరోక్ష సంకేతమిచ్చారు జగన్.
ఓదార్పు యాత్రలో తనతోపాటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటే దానికి పరిపూర్ణత సంతరించుకున్నట్లయ్యేదని అభిప్రాయపడ్డారు. అయితే ఎక్కడా తన యాత్రను నిలుపదల చేస్తున్నట్లు ప్రకటించలేదు.
Wednesday
లక్ష ఇస్తున్నందుకు అభినందనలు.. కానీ నా ఓదార్పు ఆగదు
9/01/2010 01:07:00 AM
No comments
0 comments:
Post a Comment