రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసుతున్న జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే తుది నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఇందులో మరోమాటకు తావులేదన్నారు.
ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజన విషయంలో శాశ్వత పరిష్కార మార్గాన్ని సూచిస్తుందని, ఈ కమిటీ ఇచ్చే సిఫార్సులకు తాము కట్టుబడి ఉంటామన్నారు. రాష్ట్ర ప్రజల్లో అంతర్లీనంగా సమైక్యభావన బలంగా ఉందన్నారు.
ఈ విషయం గత యేడాది డిసెంబరు తొమ్మిదో తేదీ ప్రకటన తర్వాత ప్రళయంలా బయటపడిందన్నారు. వేర్పాటువాదులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం దక్కబోదన్నారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు విభజనను అంగీకరించడం లేదన్నారు.

0 comments:
Post a Comment