Wednesday

వైఎస్ఆర్ కృషి ఫలితమే మన్నవరం ప్రాజెక్టు: మన్మోహన్

మన్నవరంలో ఎన్టీపీసీ-భెల్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కడం వెనుక దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి కృషే ప్రధాన కారణమన్నారు. బాగా వెనుకబడిన చిత్తూరు జిల్లా వాసులకు ఉపాధి కల్పించాలన్న ఏకైక ఉద్దేశ్యంతో రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్టు కోసం అహర్నిశలు పాటుపడ్డారన్నారు. ఆయన తొలి వర్థంతికి ఒక్కరోజు ముందుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. 

సుమారు ఆరు వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఎన్టీపీసీ-భెల్ ప్రాజెక్టుకు ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఈ ప్రాజెక్టుకు తన చేతులు మీదుగా శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

ఈ ప్రాజెక్టును త్వరితగతిన ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య, ఇతర అధికారులు సేకరించి ఇచ్చారని, వారిని అభినందిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్ సంబంధాలు ఉండటం వల్లే ఇలాంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తాయన్నారు. 

ఇకపోతే.. దేశాభివృద్ధిలో విద్యుత్ ఉత్పత్తి అత్యంత కీలకమైందన్నారు. అందువల్ల విద్యుత్ ఉత్పత్తి, సరఫరాల మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇందులోభాగంగానే 11, 12 పంచవర్ష ప్రణాళికలో విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. 

విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉపకరణాలను మనమే తయారు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రాజెక్టు నాటికి వచ్చే ఐదేళ్ళలో ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. 

ఈ వెనుకబడిన చిత్తూరు జిల్లాలో ప్రత్యక్షంగా ఆరు వేల మందికి, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో జిల్లా వాసులు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. వచ్చే ఐదేళ్ళలో ఐదు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పరికరాలను ఈ ప్రాజెక్టు తయారు 

0 comments:

Post a Comment