Sunday


నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ...



నాగార్జున పుట్టిన రోజు  సందర్భంగా ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ...

51వ పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటి..? 
గత పుట్టినరోజునాడు నాగచైతన్య సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఈసారి "ఏ మాయ చేసావె" చిత్రం హిట్‌తో ఎంజాయ్ చేస్తున్నాను. పైగా పుట్టినరోజు నాటికి నేను నాలుగు సినిమాల్లో చేస్తున్నాను. గగనం, వీరు దర్శకత్వంలో తెలంగాణా నేపథ్యంలో రాజన్న, ఆర్ఆర్ మూవీమేకర్‌లో శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా. అజిత్‌తో కలిసి తమిళ సినిమాలో చేస్తున్నాను. 

సినిమాల సంఖ్య పెంచడానికి కారణం...? 
నేను ఖాళీగా కూచుంటే ఎంతోమందికి పని దొరగడం లేదు. ఆమధ్య కింగ్‌లో పనిచేసిన టెక్నీషియన్ కలిశాడు. ఏం చేస్తున్నావ్ అని అడిగాను. ఖాళీ సార్.. సినిమాల్లేవు అన్నాడు. దీంతో ఒక్కసారి ఆలోచించా.. నేను ఖాళీగా ఉన్నా నాకు ఫర్వాలేదు. కానీ నా వల్ల ఎంతోమందికి పని లేకుండా పోతోంది. కనుక నటిస్తే పని దొరుకుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను.
అజిత్‌తో సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది...? 
తెలుగులో అడగలేదు. తమిళంలో నన్ను అడిగారు. మల్టీస్టారర్ చేయడం అంటే ఇష్టం. తమిళంలో అయితే వారితో చేయడం వల్ల ఇగో ఉండదు. ఇక్కడైతే అన్నీ సమస్యలే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో త్వరలో రూపొందుతుంది.

మీ  3 జనరేషన్స్ నటించే చిత్రం ఎప్పుడు..? 
త్వరలో వస్తోంది. కృష్ణవంశీ దానికి దర్శకుడు. ముగ్గురికి నచ్చేవిధంగా కథను రెడీ చేయమని చెప్పాను. ఆలస్యమైనా ఫర్వాలేదు అన్నాను. ఆ పనిలో ఉన్నారు. రాజ్ కపూర్ ఫ్యామిలీ తర్వాత తెలుగులో మూడు జనరేషన్స్ మాకే దక్కడం ఆనందంగా ఉంది. 
తెలుగు టైటిల్స్ మాత్రమే పెడతామని అన్నారు.. ఎందుకని..? 
నా గత చిత్రానికి కింగ్ అనే టైటిల్ పెట్టాను. దీని తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. అందుకే ఇక నా సినిమాలన్నీ తెలుగు పేర్లతోనే పెట్టాలని నిర్ణయించుకున్నాయి. గగనం అలాంటిదే. ముందుగా వాంటెడ్ అని అనుకున్నా, తెలుగు పేర్లకు ప్రాధాన్యమివ్వాలన్న ధ్యేయంతో తెలుగు పేర్లు పెడుతున్నాం

అఖిల్ ఏం చేస్తున్నాడు...? ప్రస్తుతం వాడికి 16 ఏళ్లు. ఆ తర్వాత క్రికెటర్ అవుతాడో.. సినిమా హీరో అవుతాడో చెప్పలేం. క్రికెటర్ అయితే ఎడ్యుకేషన్ త్యాగం చేయాలి. ఏదైనా నాకు ఇష్టమే..
రాజన్న కథ ఎలా ఉంటుంది...? 
1945-55 
మధ్య కాలంలో తెలంగాణాలో పుట్టిన రాజన్న అనే వ్యక్తి కథ. రజాకార్ల ఉద్యమంలో కీలకపాత్ర పోషించాడు. విజయేంద్రప్రసాద్ కథ ఇచ్చారు. ఈ కథను కేసీఆర్‌కు వినిపించాను. చాలా బాగుందనీ, సినిమాను వక్రీకరించ తీయవద్దని సలహా ఇచ్చారు. ఎందుకంటే సినిమావాళ్లు కథల్ని రకరకాలుగా తీస్తారని ఛలోక్తి విసిరారు.ఈ సినిమాకు ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. 

వేమన చిత్రం గురించి ఏమైంది..? 
ఏసుక్రీస్తు, వేమన చిత్రాలు చేయాలంటే చాలా కష్టం. ఎంతోమంది మనోభావాలను పరిగణలోనికి తీసుకోవాలి. ఏమాత్రం చిన్న తప్పు దొర్లినా వారిని హర్ట్ చేసిన వారమవుతాం. ప్రస్తుతం ఆ రెండు ప్రతిపాదనలు లేనట్లే.

ఈమధ్య ఇండస్ట్రీలో పలు ధోరణలు చోటుచేసుకుంటున్నాయి. దానిపై మీ స్పందన.
నీళ్లలోంచి బయటపడిన చేపలా ఉంది ఇండస్ట్రీ పరిస్థితి. మళ్లీ వాటిపై నీళ్లు పోస్తే సర్దుకుంటుంది. త్వరలో సెట్ అవుతుంది. 

అన్నపూర్ణ టీవీ నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి..? 
వర్క్ జరుగుతోంది. టీవీ ఇండస్ట్రీనే మేలు. ఒక్క సినిమా హిట్ అయితేనే డబ్బులు వస్తాయి. టీవీ అలా కాదు. మంచి కార్యక్రమం చేస్తే డబ్బులు వస్తూనే ఉంటాయి. అలాంటి కార్యక్రమాలు చేయాలి. ఒకప్పుడు స్టార్ టీవీ పడిపోయింది. అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో ఎక్కడికో వెళ్లిపోయింది

కొకైన్ వాడితే గ్లామర్‌గా వస్తారని కథనాలు వస్తున్నాయి. దీనిపై మీరెలా స్పందిస్తారు..? 
కొకైన్ అనేది మత్తుమందు. దానివల్ల అనారోగ్యం వస్తుంది తప్ప గ్లామర్ రాదు. ఎవరో తెలిసీ తెలియక అలా అని ఉంటారు. అది కొలంబియాలో రూపాయికే దొరుకుతుంది. చేతులు మారి వేలరూపాయలకు చేరుతుంది. ఇదొక ఈజీ మనీ అయిపోయింది చాలామందికి. దీన్ని యంత్రాంగమే కట్టడి చేయాలి.






మీ ఆరోగ్య రహస్యం..? 
నచ్చిన ఆహారమే మితంగా తింటాను. రోజూ వ్యాయామం చేస్తాను. ఎప్పుడూ సరదాగా ఉండేలా చూస్తాను. టెన్షన్ పెట్టుకోను. అని ముగించారు నాగార్జున.
.

గగనం’. నవంబర్‌లో విడుదల: నాగార్జున మరియు జగన్ యూత్

నాగార్జున హీరోగా రాధామోహన్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘గగనం’. ఈ చిత్రం నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ..విమానం హైజాక్‌, తదనంతర పరిణామాల నేపధ్యంలో రూపొందే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటూనే హాస్యాన్ని పంచుతుంది. గగనంలో కమాండోగా చేస్తున్నా. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్‌కు బాస్‌ని నేను. ఫ్లైట్‌ హైజాగ్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్‌ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కాందహార్‌ ఇన్సిడెంట్‌ను పోలి వుంటాయి. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్‌ అని చెప్పాలి. మంచి ఎమోషనల్‌ డ్రామా కూడా ఉంది. తెలుగులో ‘గగనం’ పేరుతో వస్తున్న ఈ చిత్రం తమిళంలో ‘పయనం’ పేరుతో రానున్నది. ఇక నుంచి నా చిత్రాలన్నిటికీ అచ్చ తెలుగు పేర్లు మాత్రమే ఉంటాయి అన్నారు. ఇక ఈ రోజు నాగార్జున గారి  పుట్టినరోజు. ఆయనకు  నాగార్జున మరియు జగన్ యూత్   శుభాకాంక్షలు తెలుపుతోంది.
  

రాజన్న గా నాగార్జున




టీ.ఆర్.ఎస్ అధినేత కెసిఆర్ ఇచ్చిన సలహాలు నాకెంతో ఉపయోగపడ్డాయని అంటున్నారునాగార్జునఅదేంటి నాగార్జున ఏమన్నా రాజకీయాల్లోకి వస్తున్నారా..కేసీఆర్ సలహాలు ఇవ్వటమేంటి అనుకోకండి...నాగార్జున ప్రస్తుతం రజాకార్ల మూవ్ మెంట్ బేసెడ్ కథతో రాజన్న అనే చిత్రం చేస్తున్నారు. ఆ కథపై అవగాహన కుదుర్చుకునే ప్రయత్నంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్ గారిని కూడా కలిశాను అని చెప్పుతున్నారు. అదే విషయాన్ని చెప్తూ..నేను ఈ సినిమా చేస్తున్నందుకు కేసీఆర్ ఎంతో ఆనందించారు. రజాకారుల మూమెంట్‌కు సంబంధించి ఎన్నో ఆసక్తికర అంశాలను ఆయన చెప్పారు. ఇంకేమైనా అనుమానాలున్నా తనను నిస్సంకోచంగా కలవచ్చు అన్నారు. ఆయన సలహాలు నాకెంతో ఉపయోగపడ్డాయి.

అలాగే రాజన్న చిత్రం నేపధ్యం గురించి చెప్తూ...1945-1965 మధ్య జరిగే కథ. మనకు స్వత్రంత్యం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ లోని కొన్ని ప్రాంతాలకు స్వతంత్య్రం రాలేదు. రజాకారుల పాలనలో అవి నలిగిపోతున్నాయి. ఆ బాధిత ప్రజానీకం కోసం పోరాడిన ఓ యోధుని కథ అది. విజయేంద్రప్రసాద్‌ అద్భుతంగా కథను తయారు చేశారు. అది నాకు ఎంత బాగా నచ్చిందంటే ఆ సినిమా చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. విజయేంద్రప్రసాద్‌ ఆరేళ్ల క్రితమే తయారు చేశారీ కథను. చివరకు అది నా దగ్గరకు వచ్చింది. విజయేంద్రప్రసాద్‌ కథ చెప్పినప్పుడు మంచి టెక్నీషియన్స్‌ను చూడండి..సెట్స్ ‌కి వెళ్లిపోదాం...అని చెప్పాను. రాజమౌళి  యాక్షన్‌ పార్ట్‌ చేస్తాడని చెప్పాడు. అంతకంటే కావాల్సిందేముంది..? తనకు ఓకే అయితే నాకెలాంటి అభ్యంతరం లేదన్నాను అన్నారు. ఇక ఈ 
చిత్రంలో నాగార్జున ప్యూర్ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడతారని తెలిసింది.

HAPPYBIRTHDAY TO KING NAG LOVE U ANNAYA



Saturday

AWARDS TO KING NAGARJUNA

AWARDS TO NAGARJUNA 

National Awards
Nandi Awards
§  1998 - Best Actor for Annamayya
§  1999 - Kansya (Bronze) Nandi Award for producing Prema Katha
§  2002 - Best Actor for Santhosham
§  2002 - Swarna (Gold) Nandi Award for producing Manmadhudu
§  2006 - Best Actor for Sri Ramadasu
Bharathamuni Awards
§  1989 - Best Actor for Geetanjali
§  1997 - Best Actor for Annamayya
Vamsi Berkley Awards
§  1986 - Best Actor for Vikram
§  1989 - Best Actor for Siva
AP cinegoers Awards
§  1989 - Best Actorfor Geetanjali
Other Awards
§  1989 - Cinema Express Award for Shiva
§  1997 - Screen Videocon Award for Annamayya
Filmfare Awards
As a producer
1997 - Filmfare Best Film Award (Telugu) for Ninne Pelladuta

HAPPYBIRTHDAY TO KING NAG



 

Thursday

మా రాజు..వైఎస్సార్ జీవిత చరిత్ర

మా రాజు..వైఎస్సార్ జీవిత చరిత్ర..స్పెషల్



ఇచ్చిన మాట కోసం


I


NAG IN JAYAPRADHAM PART 1

NAG IN JAYAPRADHAM

Friday

చంద్రబాబు గుంట నక్కలా ఉన్నారు: పొన్నం ప్రభాకర్




 ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుంట దగ్గర నక్కలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయన శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావడం తథ్యమని, వీటిని ఎదుర్కొనేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునివ్వడం పట్ల పొన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. స్థాయికి తగినట్టుగా నడుచుకోవాలని హితవు పలికారు. అలాగే, రాష్ట్రంలో బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలన్నారు. లేనిపక్షంలో ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెపుతారన్నారు. 

రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. అయితే, వీటిని పరిష్కరించుకునే సత్తా తమకు ఉందన్నారు. అంతేకానీ, ఈ కలహాలను బూచీగా చూపి మధ్యంతర ఎన్నికలు వస్తాయని ప్రజలను అయోమయానికి గురి చేయడం ఆయనకు తగదన్నారు.

Thursday

పదవి పోయినా ఫర్లేదు జగన్‌ వెంట ఉంటా: బాలినేని

పదవులు శాశ్వతం కాదని, అందువల్ల తనను మంత్రి పదవి నుంచి తొలగించినా తనకెలాంటి బాధ లేదని రాష్ట్ర గనుల శాఖామంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అందువల్ల ఆరు నూరైనా తాను కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని తేల్చి చెప్పారు. 

వచ్చే నెల మూడో తేదీన జగన్ చేపట్టే ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని, ఏర్పాట్లు చేయవద్దని అధిష్టానం మాటగా చెపుతున్నట్టు ముఖ్యమంత్రి రోశయ్యకు మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డికి గురువారం ఫోన్ చేసి చెప్పారు. ఈ మాట తనది కాదని, అహ్మద్‌ పటేల్‌ మాటగా చెపుతున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి మాటలతో బాలినేని విభేదించినట్టు సమాచారం. 

కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాధారణ గల నేత, తన బంధువైన జగన్‌ తన జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తే వెళ్లలేకుండా ఉండలేనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. పార్టీ పరంగా యాత్ర చేయాలన్న అధిష్టానం నిర్ణయం తనకు తెలియదన్నారు. ఈ విషయాన్ని ధృవీకరించుకున్న తర్వాత జగన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని బాలినేని తెలిపారు. 

పదవులు శాశ్వతం కాదన్నారు. స్నేహం, బంధుత్వాలు ముఖ్యమన్నారు. అందువల్ల ఓదార్పు యాత్రలో పాల్గొని తీరుతానన్నారు. తద్వారా తన మంత్రి పదవి పోయినా పర్వాలేదన్నారు. అదే సమయంలో తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని బాలినేని స్పష్టం చేశారు

ఓదార్పుపై సోనియా మాటలు వక్రీకరించారు: పురంధేశ్వరి

వై. ఎస్ .ఆర్ జిల్లా ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుకూలమేనని, ఈ యాత్రపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని విశాఖ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరి వెల్లడించారు. ఆమె గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక అశువులు బాసిన కుటుంబాలను ఓదార్చాలని సోనియా గాంధీ కోరుకున్నారన్నారు. అయితే అదీకూడా కాంగ్రెస్ పార్టీ పరంగా జరగాలని, మరణించిన కుటుంబాలవారికి పార్టీ తరపున ఆర్థిక సాయం చేయాలని ఆమె చెప్పారని పురంధేశ్వరి తెలిపారు. అయితే ఈ విషయంలో తన మాటలు వక్రీకరించినట్టు సోనియా గాంధీ చెప్పారని పురంధేశ్వరి వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సాగిస్తున్న యాత్రలో పాల్గొనవద్దని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు అహ్మద్ పటేల్‌ చెప్పారని పురంధేశ్వరి ధృవీకరించారు.

ఈ రాష్ట్రానికి భవిష్యత్ ఆశాకిరణం వైఎస్.జగన్: భూమన



ఈ రాష్ట్రానికి భవిష్యత్ ఆశాకిరణం వైఎస్.జగన్మోహన్ రెడ్డి అని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి గుర్తులను, జ్ఞాపకాలను ప్రజల మనస్సుల్లో నుంచి ఏ ఒక్కరూ చెరిపేయలేరన్నారు. 
వైఎస్‌పై దుష్ప్రచారం చేసి రాజకీయలబ్ధి పొందాలన్న ఏకైక ఉద్దేశ్యంతోనే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్ కుటుంబంపై ఆరోపణలు చేయడమంటే సూర్యునిపై ఉమ్మేసినట్టేనన్నారు. 
ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్టు వస్తున్న వార్తలపై ప్రజలే సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిగ్గు తేల్చేందుకు సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేస్తున్నట్టు భూమన ప్రకటించారు. 
తన డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా ఇదే అంశంపై తాను శుక్రవారం నుంచి ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ దీక్ష తిరుపతిలో జరుగుతుందని భూమన వెల్లడించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను వివాదాలమయం చేయడం దురదృష్టకరమన్నారు.

Sunday

జగన్ సారధ్యం లో నే కాంగ్రెస్


ప్రియతం నేత దివంగత ముఖ్యమంత్రి  వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి తరువాత అంతటి ప్రజాదరణ గల ఏకయిక వ్యక్తి జగన్ అని  భవిష్యతు లో 
జగన్ కాంగ్రెస్ పార్టీ కు సారధ్యం వహించే  శక్తి భలం కేవలం జగన్ కే వుంది అని ఏ ఐ సి సి అద్యక్షురాలు సోనియా కు జగన్ కు మధ్య మీడియా నే అగాధం సృష్టిస్తోంది అని అయన అన్నారు