నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ...
51వ పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటి..?
గత పుట్టినరోజునాడు నాగచైతన్య సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఈసారి "ఏ మాయ చేసావె" చిత్రం హిట్‌తో ఎంజాయ్ చేస్తున్నాను. పైగా పుట్టినరోజు నాటికి నేను నాలుగు సినిమాల్లో చేస్తున్నాను. గగనం, వీరు దర్శకత్వంలో తెలంగాణా నేపథ్యంలో రాజన్న, ఆర్ఆర్ మూవీమేకర్‌లో శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా. అజిత్‌తో కలిసి తమిళ సినిమాలో చేస్తున్నాను.
సినిమాల సంఖ్య పెంచడానికి కారణం...?
నేను ఖాళీగా కూచుంటే ఎంతోమందికి పని దొరగడం లేదు. ఆమధ్య కింగ్‌లో పనిచేసిన టెక్నీషియన్ కలిశాడు. ఏం చేస్తున్నావ్ అని అడిగాను. ఖాళీ సార్.. సినిమాల్లేవు అన్నాడు. దీంతో ఒక్కసారి ఆలోచించా.. నేను ఖాళీగా ఉన్నా నాకు ఫర్వాలేదు. కానీ నా వల్ల ఎంతోమందికి పని లేకుండా పోతోంది. కనుక నటిస్తే పని దొరుకుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను.
అజిత్‌తో సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది...?
తెలుగులో అడగలేదు. తమిళంలో నన్ను అడిగారు. మల్టీస్టారర్ చేయడం అంటే ఇష్టం. తమిళంలో అయితే వారితో చేయడం వల్ల ఇగో ఉండదు. ఇక్కడైతే అన్నీ సమస్యలే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో త్వరలో రూపొందుతుంది.
మీ 3 జనరేషన్స్ నటించే చిత్రం ఎప్పుడు..?
త్వరలో వస్తోంది. కృష్ణవంశీ దానికి దర్శకుడు. ముగ్గురికి నచ్చేవిధంగా కథను రెడీ చేయమని చెప్పాను. ఆలస్యమైనా ఫర్వాలేదు అన్నాను. ఆ పనిలో ఉన్నారు. రాజ్ కపూర్ ఫ్యామిలీ తర్వాత తెలుగులో మూడు జనరేషన్స్ మాకే దక్కడం ఆనందంగా ఉంది.
తెలుగు టైటిల్స్ మాత్రమే పెడతామని అన్నారు.. ఎందుకని..?
నా గత చిత్రానికి కింగ్ అనే టైటిల్ పెట్టాను. దీని తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. అందుకే ఇక నా సినిమాలన్నీ తెలుగు పేర్లతోనే పెట్టాలని నిర్ణయించుకున్నాయి. గగనం అలాంటిదే. ముందుగా వాంటెడ్ అని అనుకున్నా, తెలుగు పేర్లకు ప్రాధాన్యమివ్వాలన్న ధ్యేయంతో తెలుగు పేర్లు పెడుతున్నాం
అఖిల్ ఏం చేస్తున్నాడు...? ప్రస్తుతం వాడికి 16 ఏళ్లు. ఆ తర్వాత క్రికెటర్ అవుతాడో.. సినిమా హీరో అవుతాడో చెప్పలేం. క్రికెటర్ అయితే ఎడ్యుకేషన్ త్యాగం చేయాలి. ఏదైనా నాకు ఇష్టమే..
రాజన్న కథ ఎలా ఉంటుంది...?
1945-55 మధ్య కాలంలో తెలంగాణాలో పుట్టిన రాజన్న అనే వ్యక్తి కథ. రజాకార్ల ఉద్యమంలో కీలకపాత్ర పోషించాడు. విజయేంద్రప్రసాద్ కథ ఇచ్చారు. ఈ కథను కేసీఆర్‌కు వినిపించాను. చాలా బాగుందనీ, సినిమాను వక్రీకరించ తీయవద్దని సలహా ఇచ్చారు. ఎందుకంటే సినిమావాళ్లు కథల్ని రకరకాలుగా తీస్తారని ఛలోక్తి విసిరారు.ఈ సినిమాకు ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది.
వేమన చిత్రం గురించి ఏమైంది..?
ఏసుక్రీస్తు, వేమన చిత్రాలు చేయాలంటే చాలా కష్టం. ఎంతోమంది మనోభావాలను పరిగణలోనికి తీసుకోవాలి. ఏమాత్రం చిన్న తప్పు దొర్లినా వారిని హర్ట్ చేసిన వారమవుతాం. ప్రస్తుతం ఆ రెండు ప్రతిపాదనలు లేనట్లే.
ఈమధ్య ఇండస్ట్రీలో పలు ధోరణలు చోటుచేసుకుంటున్నాయి. దానిపై మీ స్పందన..
నీళ్లలోంచి బయటపడిన చేపలా ఉంది ఇండస్ట్రీ పరిస్థితి. మళ్లీ వాటిపై నీళ్లు పోస్తే సర్దుకుంటుంది. త్వరలో సెట్ అవుతుంది.
అన్నపూర్ణ టీవీ నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి..?
వర్క్ జరుగుతోంది. టీవీ ఇండస్ట్రీనే మేలు. ఒక్క సినిమా హిట్ అయితేనే డబ్బులు వస్తాయి. టీవీ అలా కాదు. మంచి కార్యక్రమం చేస్తే డబ్బులు వస్తూనే ఉంటాయి. అలాంటి కార్యక్రమాలు చేయాలి. ఒకప్పుడు స్టార్ టీవీ పడిపోయింది. అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో ఎక్కడికో వెళ్లిపోయింది
కొకైన్ వాడితే గ్లామర్‌గా వస్తారని కథనాలు వస్తున్నాయి. దీనిపై మీరెలా స్పందిస్తారు..?
కొకైన్ అనేది మత్తుమందు. దానివల్ల అనారోగ్యం వస్తుంది తప్ప గ్లామర్ రాదు. ఎవరో తెలిసీ తెలియక అలా అని ఉంటారు. అది కొలంబియాలో రూపాయికే దొరుకుతుంది. చేతులు మారి వేలరూపాయలకు చేరుతుంది. ఇదొక ఈజీ మనీ అయిపోయింది చాలామందికి. దీన్ని యంత్రాంగమే కట్టడి చేయాలి.
మీ ఆరోగ్య రహస్యం..?
నచ్చిన ఆహారమే మితంగా తింటాను. రోజూ వ్యాయామం చేస్తాను. ఎప్పుడూ సరదాగా ఉండేలా చూస్తాను. టెన్షన్ పెట్టుకోను. అని ముగించారు నాగార్జున.
నచ్చిన ఆహారమే మితంగా తింటాను. రోజూ వ్యాయామం చేస్తాను. ఎప్పుడూ సరదాగా ఉండేలా చూస్తాను. టెన్షన్ పెట్టుకోను. అని ముగించారు నాగార్జున.
0 comments:
Post a Comment