ఈ రాష్ట్రానికి భవిష్యత్ ఆశాకిరణం వైఎస్.జగన్మోహన్ రెడ్డి అని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి గుర్తులను, జ్ఞాపకాలను ప్రజల మనస్సుల్లో నుంచి ఏ ఒక్కరూ చెరిపేయలేరన్నారు.
వైఎస్‌పై దుష్ప్రచారం చేసి రాజకీయలబ్ధి పొందాలన్న ఏకైక ఉద్దేశ్యంతోనే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్ కుటుంబంపై ఆరోపణలు చేయడమంటే సూర్యునిపై ఉమ్మేసినట్టేనన్నారు.
ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్టు వస్తున్న వార్తలపై ప్రజలే సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిగ్గు తేల్చేందుకు సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేస్తున్నట్టు భూమన ప్రకటించారు.
తన డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా ఇదే అంశంపై తాను శుక్రవారం నుంచి ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ దీక్ష తిరుపతిలో జరుగుతుందని భూమన వెల్లడించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను వివాదాలమయం చేయడం దురదృష్టకరమన్నారు.

0 comments:
Post a Comment