Sunday

రాజన్న గా నాగార్జున




టీ.ఆర్.ఎస్ అధినేత కెసిఆర్ ఇచ్చిన సలహాలు నాకెంతో ఉపయోగపడ్డాయని అంటున్నారునాగార్జునఅదేంటి నాగార్జున ఏమన్నా రాజకీయాల్లోకి వస్తున్నారా..కేసీఆర్ సలహాలు ఇవ్వటమేంటి అనుకోకండి...నాగార్జున ప్రస్తుతం రజాకార్ల మూవ్ మెంట్ బేసెడ్ కథతో రాజన్న అనే చిత్రం చేస్తున్నారు. ఆ కథపై అవగాహన కుదుర్చుకునే ప్రయత్నంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్ గారిని కూడా కలిశాను అని చెప్పుతున్నారు. అదే విషయాన్ని చెప్తూ..నేను ఈ సినిమా చేస్తున్నందుకు కేసీఆర్ ఎంతో ఆనందించారు. రజాకారుల మూమెంట్‌కు సంబంధించి ఎన్నో ఆసక్తికర అంశాలను ఆయన చెప్పారు. ఇంకేమైనా అనుమానాలున్నా తనను నిస్సంకోచంగా కలవచ్చు అన్నారు. ఆయన సలహాలు నాకెంతో ఉపయోగపడ్డాయి.

అలాగే రాజన్న చిత్రం నేపధ్యం గురించి చెప్తూ...1945-1965 మధ్య జరిగే కథ. మనకు స్వత్రంత్యం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ లోని కొన్ని ప్రాంతాలకు స్వతంత్య్రం రాలేదు. రజాకారుల పాలనలో అవి నలిగిపోతున్నాయి. ఆ బాధిత ప్రజానీకం కోసం పోరాడిన ఓ యోధుని కథ అది. విజయేంద్రప్రసాద్‌ అద్భుతంగా కథను తయారు చేశారు. అది నాకు ఎంత బాగా నచ్చిందంటే ఆ సినిమా చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. విజయేంద్రప్రసాద్‌ ఆరేళ్ల క్రితమే తయారు చేశారీ కథను. చివరకు అది నా దగ్గరకు వచ్చింది. విజయేంద్రప్రసాద్‌ కథ చెప్పినప్పుడు మంచి టెక్నీషియన్స్‌ను చూడండి..సెట్స్ ‌కి వెళ్లిపోదాం...అని చెప్పాను. రాజమౌళి  యాక్షన్‌ పార్ట్‌ చేస్తాడని చెప్పాడు. అంతకంటే కావాల్సిందేముంది..? తనకు ఓకే అయితే నాకెలాంటి అభ్యంతరం లేదన్నాను అన్నారు. ఇక ఈ 
చిత్రంలో నాగార్జున ప్యూర్ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడతారని తెలిసింది.

0 comments:

Post a Comment