Monday

నాగార్జున హీరోగా ఆర్.ఆర్.మూవీమేకర్స్ భారీ చిత్రం


గత ఏడాది "కిక్" వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించి, ఆగస్టు 6న "డాన్ శీను" వంటి సూపర్ మూవీని రిలీజ్ చేస్తున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ "కింగ్" నాగార్జున హీరోగా ఓ ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
ఈ చిత్రం గురించి వెంకట్ మాట్లాడుతూ... నాగార్జునగారితో ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలన్న కోరిక ఈ సంవత్సరం నెరవేరుతోంది. నాగార్జునగారు ఇంతకుముందు చెయ్యని కొత్త తరహా సబ్జెక్టుతో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ అత్యంత భారీగా, అత్యున్నత సాంకేతిక విలువలతో చాలా హై స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. నాగార్జున సరసన ఓ అగ్ర కథానాయిక నటించే ఈ చిత్రంలో భారీ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తారు. అగ్ర సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తారని చెప్పారు.
ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి నిర్మాత: వెంకట్, దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి, త్వరలో అన్ని వివరాలూ ప్రకటిస్తారు

0 comments:

Post a Comment