Thursday

Monday

Sunday

ప్రరాపా కార్యాలయ గేటు కీపర్‌ను మాత్రమే: అల్లు అరవింద్

తాను పార్టీ ప్రధాన కార్యాలయ గేటు కీపర్‌ను మాత్రమేనని ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తానని చెప్పారు. అల్లు అరవింద్‌ను తిరిగి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ప్రరాపా ప్రధాన కార్యాలయం శనివారం ఒక పత్రిక ప్రకటన ద్వారా ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రరాపా నేతలు కార్యకర్తలు ప్రత్యేక బహుమతిని ఈ రూపంలో ఇచ్చారన్నారు. ఇకపోతే.. పార్టీలో తన పాత్ర గురించిన ప్రశ్నించగా, పార్టీలో గేటు కీపర్‌ననే విషయం తనకు ఎల్లపుడూ గుర్తుంటుందన్నారు. ఈ విషయాన్ని మాత్రం విస్మరించకుండా, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతానన్నారు. అయితే, మరోవైపు రాజకీయ విశ్లేషకులు మాత్రం.. అల్లు అరవింద్ నియామకంపై రాజకీయ విశ్లేషకులు మరోలా స్పందిస్తున్నారు. పార్టీ అభివృద్ధికి అల్లు అరవింద్ నియామకం ఎంతగానే బలం చేకూర్చుతుందన్నారు. అలాగే, పార్టీలో గంటా శ్రీనివాసరావు వంటి అగ్రనేతలకు కీలక పదవులను కేటాయించాలని వారు అభిప్రాయపడ్డారు.

దమ్ముంటే వీధుల్లోకి రండి.. తేల్చుకుందాం: హరీష్ రావు

తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేతల మధ్య మాటలయుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. తెదేపా నేతలకు దమ్ముంటే వీధుల్లోకి వస్తే ఎవరేంటో తేల్చుకుందామని తెరాస నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబుకు దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. ఎక్కడో ఎన్టీఆర్ భవన్‌లో కూర్చొని మాట్లాడటం మాని ముఖాముఖి తేల్చుకోవడానికి సిద్ధం కావాలన్నారు. ఇకపోతే.. తమ పార్టీ అధినేత, తమపైనా విమర్శలు చేసే నైతిక అర్హత మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్‌కు లేదన్నారు. తెదేపా నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టి ఆయన యేడాది తిరగకముందే తెదేపా గూటికి చేరిన వలస పక్షి అని అన్నారు. అందువల్ల ఆయన కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ముఖ్యంగా, తెదేపా మహానాడులో తెలంగాణ అమరులకు సంతాప తీర్మానాన్ని తెదేపా తెలంగాణ ప్రాంత నేతలు చేయించలేక పోయారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ, వారసత్వ పార్టీ అని దుమ్మెత్తి పోశారు.

విభేదాలు ముదిరితే తెలంగాణ నీరుగారిపోతుంది: కేకే

తెలంగాణ ప్రాంతంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన చెందిన నేతల మధ్య ఉన్న విభేదాలు ముదిరితే తెలంగాణ అంశం మరుగునపడిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కే.కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలు సమన్వయంతో పనిచేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసీ) అవసరం లేదన్నారు. కావాల్సిందల్లా అన్ని పార్టీలకు చెందిన నేతలంతా సమన్వయంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ఇందుకోసం ఆయా పార్టీల నేతలతో మాట్లాడడానికి తాను సిద్ధమని కేకే ప్రకటించారు. తెలంగాణ సాధన కోసం పోరాడుతున్న పార్టీలన్నీ చిన్నచిన్న విభేదాలతో కలహించుకోవడం తగదని హితవు పలికారు. ఈ విభేదాలు, కలహాలు తారా స్థాయికి చేరితే తెలంగాణ ఉద్యమం నీరుగారి పోతుందన్నారు. లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

జస్టీస్ శ్రీకృష్ణ గీతకు కట్టుబడి ఉంటా: ఎంపీ లగడపాటి

రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసుతున్న జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే తుది నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఇందులో మరోమాటకు తావులేదన్నారు. 

ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజన విషయంలో శాశ్వత పరిష్కార మార్గాన్ని సూచిస్తుందని, ఈ కమిటీ ఇచ్చే సిఫార్సులకు తాము కట్టుబడి ఉంటామన్నారు. రాష్ట్ర ప్రజల్లో అంతర్లీనంగా సమైక్యభావన బలంగా ఉందన్నారు. 

ఈ విషయం గత యేడాది డిసెంబరు తొమ్మిదో తేదీ ప్రకటన తర్వాత ప్రళయంలా బయటపడిందన్నారు. వేర్పాటువాదులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం దక్కబోదన్నారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు విభజనను అంగీకరించడం లేదన్నారు.

Friday

Thursday

Monday