Sunday

దమ్ముంటే వీధుల్లోకి రండి.. తేల్చుకుందాం: హరీష్ రావు

తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేతల మధ్య మాటలయుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. తెదేపా నేతలకు దమ్ముంటే వీధుల్లోకి వస్తే ఎవరేంటో తేల్చుకుందామని తెరాస నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబుకు దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. ఎక్కడో ఎన్టీఆర్ భవన్‌లో కూర్చొని మాట్లాడటం మాని ముఖాముఖి తేల్చుకోవడానికి సిద్ధం కావాలన్నారు. ఇకపోతే.. తమ పార్టీ అధినేత, తమపైనా విమర్శలు చేసే నైతిక అర్హత మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్‌కు లేదన్నారు. తెదేపా నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టి ఆయన యేడాది తిరగకముందే తెదేపా గూటికి చేరిన వలస పక్షి అని అన్నారు. అందువల్ల ఆయన కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ముఖ్యంగా, తెదేపా మహానాడులో తెలంగాణ అమరులకు సంతాప తీర్మానాన్ని తెదేపా తెలంగాణ ప్రాంత నేతలు చేయించలేక పోయారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ, వారసత్వ పార్టీ అని దుమ్మెత్తి పోశారు.

0 comments:

Post a Comment